TG | ఫోన్ ట్యాపింగ్ కేసు… బెయిల్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా

ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న, భుజంగరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు కోర్టులో చార్జిషీటు లేదని… అరెస్టు చేసిన 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయకుంటే బెయిల్ మంజూరు చేయవచ్చన్న నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే 90 రోజులలోపే చార్జిషీట్‌ దాఖలు చేశామని పోలీసుల తరఫు న్యాయవాదులు తెలిపారు. చార్జిషీటును కోర్టు వెనక్కి పంపిందని… ఇలా పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.

Exit mobile version