హైదరాబాద్ వన్ డ్రైవ్ ఫుడ్ కోర్టు ఘటనపై పోలీసులు ముమ్మర విచారణ చేస్తున్నారు. నిందితుడు బెనర్జీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్‌రోడ్డు నెంబర్ 10లోని వన్ డ్రైవ్ ఫుడ్ కోర్టులో అక్కడే పనిచేసే బెనర్జీ అనే వ్యక్తి మహిళల బాత్ రూంలో తన సెల్ ఫోన్ కెమెరాను అమర్చాడు. దీనిని ఓ యువతి గుర్తించింది. యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె సమాచారంతో ఫుడ్ కోర్టు వద్దకు చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. గత రెండు రోజులుగా బెనర్జీ తన ఫోన్ కెమెరాను ఉద్దేశపూర్వకంగానే బాత్ రూంలో అమర్చినట్టు నిర్ధారించారు. నిందితుడిపై కేసు నమోదు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బెనర్జీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వీడియోలు చిత్రీకరించిన ఫోన్‌లో సిమ్‌కార్డు లేదని గుర్తించారు. రికార్డైన వీడియోలతో నిందితుడు ఎవర్నైనా బ్లాక్‌మెయిల్ చేశాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: గుంటూరు జిల్లాలో టీడీపీకి షాక్.. మాజీ మంత్రి రాజీనామా