తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 80 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది…రాబోయే రోజుల్లో ఆర్టీసి బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
సీసీఎస్ బకాయిలు దశల వారీగా విడుదల చేస్తామని… ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి సిబ్బంది సంయమనంతో ఉండండన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ఉచిత టిక్కెట్లపై ప్రయాణించారు. 400 కోట్లతో 1050 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని… ఖాకీ దుస్తుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బంది సంస్థను కాపాడుతున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ అండ్ సీటర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు.