అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రకటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడికి ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. ఇంతటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం రోడ్‌సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తుందని, రాష్ట్రం కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, వర్షాకాలం రాకముందే రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు.
ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ : పవన్ కల్యాణ్
Advertisement
తాజా వార్తలు
Advertisement