Friday, November 22, 2024

TS: హైకోర్టులో దానం నాగేందర్కి వ్యతిరేకంగా పిటిషన్

లోక్‌సభ ఎన్నికల వేళ ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. దానం కాంగ్రెస్‌ చేరడం, సికింద్రబాద్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన దానం.. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.. గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున దానం నాగేందర్ బరిలో ఉన్నారు.

అయితే, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపీగా దానం నాగేందర్ పోటీ చేయడం చట్ట విరుద్ధం.. ఇది రాజ్యాంగ విరుద్ధమ‌ని పిటిషనర్ రాజు యాదవ్ పేర్కొన్నారు. వెంటనే దానం నాగేందర్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఇక, దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. అయితే, దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement