Tuesday, September 17, 2024

Peruru జాతీయ రహదారిపై గోదావరి పరవళ్లు… రాకపోకలు బంద్

వాజేడు జులై 21 ప్రభ న్యూస్ : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా పెరిగి ఉగ్రరూపం దాల్చింది గోదావరి భారీగా పెరుగుతూ ములుగు జిల్లాలోని వాజేడు మండలం పేరూరు వద్ద 15. 680 మీటర్లకు చేరడంతో తెలంగాణ చతిస్గడ్ రాష్ట్రాల మధ్య సరిహద్దులోని టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారి నీట మునిగింది

దీనితో అంతా రాష్ట్ర రాకపోకలు స్తంభించాయి ప్రమాద భరితంగా ఉన్నందున తెలంగాణ త్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణాను నిలిపివేశారు అటువైపు ఎవరు కూడా వంతెన దాటే ప్రయత్నం చేయకూడదని పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ హెచ్చరికలు జారీ చేస్తూ భార్గెట్లను ఏర్పాటు చేశారు పోలీస్ చెప్పే సూచనలు తప్పకుండ పాటించాలని కోరారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement