Friday, November 22, 2024

దివ్యాంగుల‌ను స్వ‌తంత్రంగా కొన‌సాగించాలి

దివ్యాంగుల శాఖను స్వతంత్రంగా కొనసాగించాలని వికలాంగుల జాయింట్ యాక్షన్ సంగారెడ్డి జిల్లా కన్వినర్ అమిదిపురం మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో దివ్యాంగుల శాఖను శిశు సంక్షేమ శాఖలో విలీనం ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ గోపిరెడ్డి వీరారెడ్డికి జాయింట్ యాక్షన్ కమిటీ వినతిపత్రం సమర్పించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు అమిదిపురం మహేష్ కుమార్ మాట్లాడుతూ… గత మూడు దశాబ్దాలుగా దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఉన్న దివ్యాంగుల సంక్షేమ శాఖను పాలనా సౌలభ్యం కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జాయింట్ యాక్షన్ కమిటీ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.

ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ 2016 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అనేక విధాలుగా తమ నిరసనను తెలిపినప్పటికీ ప్రభుత్వం తన ఆలోచన విరమించుకోలేదని, తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం బాధాకరమన్నారు. జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పది పాయింట్లు, 50 లక్షల మంది దివ్యాంగులు ఉండగా వికలాంగులను రెండువేల ప్రకారం ప్రభుత్వం ఇరవై ఒక్క రకాల దివ్యాంగులను చేయడంతో ప్రస్తుతం 25 లక్షల జనాభా శాతం అధికంగా ఉన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక శాఖను తొలగించడం కారణంగా వారికి లభించే కనీస గుర్తింపు లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం తన ప్రయత్నాన్ని విరమించుకొని దివ్యాంగుల‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement