సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద గందరగోళం నెలకొంది. ఓ వ్యక్తి శనివారం మధ్యాహ్నం హల్చల్ చేశాడు. ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తనకు తగిన గుర్తింపు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకనే తాను చనిపోవాలని అనుకున్నట్టు తెలిపాడు.
ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే యత్నం చేశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, ముఖ్యమంత్రి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అతను ఈ చర్యకు పాల్పడ్డట్టు తెలిపాడు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.. తనలాంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు భూపాలపల్లికి చెందిన కాంగ్రెస్ నేత కృష్ణ సాగర్ పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.