ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరింది. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన కృషి మరువలేనిది. నగరంలో స్థాపించే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు రూ.166 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేయగా 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. దీంతో ఖమ్మం కిరీటంలో మరో మరో కలికితురాయి చేరింది. ఈ మేరకు నగరంలోని పాత కలెక్టరేట్ స్థలంతో పాటు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గల మొత్తం 30 ఎకరాల ప్రభుత్వ భూమిని మెడికల్ కాలేజీ ఏర్పాటుకు బదలాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఖమ్మం మెడికల్ కాలేజీకి అనుమతి.. 166 కోట్లు మంజూరు, 30 ఎకరాల స్థలం బదలాయింపు
Advertisement
తాజా వార్తలు
Advertisement