హైదరాబాద్, ప్రభన్యస్ : రాత్రి సమయం లోనూ పోస్టుమార్టం చేయొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్తగా విడుదల చేసిన నిబంధనలను రాష్ట్రంలో అమలు చెయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై రాష్ట్రంలో రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం చేయాలని అన్ని మెడికల్ కాలేజీలను ఆదేశించింది. దీంతో ఇకమీదట పోస్టు మార్టం సేవలు డే అండ్ నైట్ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, విద్య డైరెక్టర్ డా.రమేష్‌రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సూర్తాస్తమయం తర్వాత పోస్టుమార్టం చేసేందుకు కావాల్సిన అన్ని రకాల నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, సూపరిండెంట్లు చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి సమయంలో జరిగే అన్ని పోస్టుమార్టం పరీక్షలను వీడియో తీయాలని ఆదేశించారు. మంరీ ముఖ్యంగా అవయవదానం కేసుల్లో సాయంత్రం/రాత్రి వేళ్లలోనూ పోస్టు మార్టం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిం చారు.
అయితే ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు, అత్యాచార మరణాలు, కుళ్లిపోయే స్థితిలో ఉన్న శవాలకు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వేళ్లలో పోస్టుమార్టం చేయొద్దని ఉత్తర్వుల్లో డీఎంఈ తేల్చిచెప్పారు. చట్టపరమైన శాంతి భద్రతల నిబంధనలు అనుమతిస్తే సాయంత్రం పోస్టుమార్టం చేయరాదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా చట్ట ప్రకారం మృతదేహాలకు ఇప్పటి వరకు కేవలం పగటిపూట మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు అనుమతి ఉంది. దీంతో కొన్ని సందర్బాల్లో పోస్టు మార్టం కోసం గంటల తరబడి దవాఖానాలోనే మృతదేహంతో నిరీక్షించాల్సిన పరిస్థితిని బాధితులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుమార్టం చేసేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో 24 గంటలూ పోస్టుమార్టం చేయొచ్చని పేర్కొంది. బ్రిటీష్ కాలం నాటి నుంచి అమలులో ఉన్న విధానానికి స్వస్థి పలుకుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కూడా రాష్ట్రంలో సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టమార్టం నిర్వహించేందుకు అనుగుణంగా తాజా ఆదేశాలు జారీ చేసింది.
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital