Friday, January 31, 2025

RR | రైతు భరోసా అమలులో సక్రమంగా విధులు నిర్వహించండి.. అధికారులతో తుమ్మల

వికారాబాద్, జనవరి 28 (ఆంధ్రప్రభ ) : రైతు భరోసా విషయంలో వ్యవసాయ అధికారులు బాధ్యతాయుతంగా వివరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన వివిధ జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు.

తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ… ప్రభుత్వం రూపొందించిన పథకాల అమలులో అధికారులదే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్ కుమార్, హార్టికల్చర్ అధికారి వైజయంతి, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement