న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన యాత్ర చేపట్టారు. బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు ఖమ్మం, పాలేరు, మధిర నియోజక వర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు స్టడీ టూర్‌లో భాగంగా మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. వారందరికీ నామ నాగేశ్వరరావు తన నివాసంలో ఆత్మీయ ఆతిథ్యం ఏర్పాటు చేశారు. నామ నేతృత్వంలో ఈ నెల 8వ తేదీ వరకు జరిగే విజ్ఞాన విహార యాత్రలో భాగంగా ప్రజాప్రతినిధుల బృందం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించి వాటి గురించి అనేక విషయాలు తెలుసుకుంటారు.
ఇందులో భాగంగా అక్షరధామ్, ఇండియా గేట్, పార్లమెంట్ భవనం, ఆగ్రాలోని తాజ్‌మహల్, తదితర చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. కూసుమంచి జడ్పీటీసీ ఇంటూరి బేబీ, ఇంటూరి శేఖర్, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఎంపీపీ బెల్లం ఉమ, ఖమ్మం రూరల్ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, యండపల్లి సింధు, నేలకొండపల్లి జడ్పీటీసీ మరికంటి ధనలక్ష్మి, మరికంటి రేణుబాబు, రఘునాథపాలెం జడ్పీటీసీ మాలోత్ ప్రియాంక, మాలోత్ రాజా, చింతకాని మండల పార్టీ అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య ఉన్నారు.
ఇక.. చింతకాని జడ్పీటీసీ పరసగాని తిరుపతి కిషోర్, మధిర మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పార్టీ మధిర పట్టణ అధ్యక్షులు పల్లపోతు వెంకటేశ్వరరావు, ముదిగొండ జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, పసుపులేటి వెంకటేశ్వర్లు, బోనకల్ మండల పార్టీ అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, ఎర్రుపాలెం మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు, ముదిగొండ మండల పార్టీ అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు వేముల వీరయ్య, తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు బాశబోయిన వీరన్న, ఖమ్మం రూరల్ మండలం నుంచి గూడ సంజీవ్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి నామ నాగేశ్వరరావు తన సొంత ఖర్చులతో జిల్లాకు చెందిన వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులను న్యూఢిల్లీ తీసుకొచ్చి వారికి పలు చారిత్రక, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన వేలాది మందిని న్యూఢిల్లీ తీసుకొచ్చి దేశ చరిత్రను కళ్లకు కట్టారు.