Sunday, November 24, 2024

WGL | మత్స్యకారులకు అండగా ప్రజా ప్రభుత్వం.. యశస్విని ఝాన్సీ రెడ్డి

తొర్రూరు, అక్టోబర్26 (ఆంధ్రప్రభ) : మత్స్యకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం, హరిపిరాల చెరువులలో మత్స్యశాఖ అధికారులతో కలిసి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేపపిల్లల విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని చేప పిల్లలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ… గంగపుత్రుల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేప పిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని కులవృత్తుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చేప పిల్లలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చేపల ఉత్పత్తి గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులైన ముదిరాజ్ లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.

అమ్మపురం చెరువులో 50 వేలు, హరిపిరాల చెరువులో 1లక్ష 25వేల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జిల్లా అధికారి బి.వీరన్న, ఏఎంసీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గొడుగు శ్రీనివాస్, రూరల్ డెవలప్మెంట్ కమిషన్ డైరెక్టర్ వెంకటనారాయణగౌడ్, ఏఎంసీ డైరెక్టర్ అచ్చిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కందాడి అశోక్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ చైర్మెన్ కొత్తూరు రమేష్, అధికారులు, నాయకులు, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement