కాగజ్ నగర్ టౌన్ జూన్ 28(ప్రభన్యూస్) – పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూములు పట్టణ పేదలకు ఇవ్వాలని,ఇంటి స్థలం ఉన్నవారికి నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు,కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చెల్లించాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముంజం ఆనంద్ కుమార్,మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అనిత,ఆటో యూనియన్ నాయకులు ఇన్నోస్,ఆశ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్.పద్మ లు మాట్లాడుతూ పేదలందరికీ ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు,డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు,పెన్షన్ లేనివారికి పెన్షన్లు వెంటనే ఇవ్వాలని అన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ కి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి.సంజీవ్, మల్లేష్,పద్మ,సురేఖ, డివైఎఫ్ఐ నాయకులు చాపిడి పురుషోత్తం,శివ, రత్న కుమార్,సతీష్, నీలేష్,మహిళా సంఘం నాయకులు మీనా,ఆటో యూనియన్ నాయకులు ఖాన్,షరీఫ్,అక్బర్, తదితరులు పాల్గొన్నారు.