Tuesday, November 26, 2024

TS: పిల్లల దత్తత ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : మంత్రి సీతక్క

పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటే చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. యూసుఫ్​గూడలోని శిశు విహార్​ను ఆమె సందర్శించారు. ఇటీవల అక్రమ రవాణా నుంచి పోలీసులు విముక్తి కల్పించిన చిన్నారులను పరామర్శించారు. చట్టబద్ధంగా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు దత్తత తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి అన్నారు.

చిన్నారుల యోగక్షేమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా చూసుకోవాలని, ఎలాంటి లోటు రానీయొద్దని సూచించారు. దత్తత ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి తగిన సలహాలు ఇవ్వాలని అధికారులకు తెలిపారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ నిర్మల కాంతి వెస్లీ, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement