Saturday, November 23, 2024

ఎక్కడి సమస్యలు అక్కడే.. శిలాఫలకాన్ని ఆవు పేడ కొట్టి నిరసన

ఎన్నికలు వస్తున్నాయి.. నేతలు మారుతున్నారు.. అయినా పేదల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజలను మర్చిపోతున్నారు. జనం సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. చేసిన వాగ్ధానాలు.. చెప్పిన మాటలన్నీ నీటి మూటలే అవుతున్నాయి. కొద్దిమంది ఎమ్మెల్యేలు కొన్ని పనులు చేసినప్పటికీ మిగితా నియోజకవర్గాల్లో సమస్యలు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. తాజాగా కొమరంభీం జిల్లా బెజ్జూరులో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయినా నేటీకి నిర్మాణానికి నోచుకోలేదు. దీంతో స్థానికులు నిసనర బాట పట్టారు.

ఆస్సత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసి మూడేళ్లు అయిన సందర్భంగా “శిలాఫలకానికి మూడేండ్లు- మీకు సిగ్గురావడానికి ఇంకెన్ని ఏండ్లు” అనే శీర్షికన ఏర్పాటు చేసిన ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 30.08.2018 రోజున అప్పటి మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వేసిన శిలాఫలకానికి ఫినాయిల్ తో అభిషేకించి ఆవుపేడ తో చేసిన పిడకలను కొట్టారు. ఈ సందర్భంగా డా.పాల్వాయి మాట్లాడుతూ కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడం కోసం వేసిన శిలాఫలకం నేడు పిడకలను ఆరబెట్టడానికి మాత్రమే అక్కరకు వస్తోందని దుయ్యబట్టారు. ఇదో వినూత్న నిరసన ప్రదర్శన అని తెలిపారు. ఇకనైనా ప్రజా ప్రతినిధులు స్పందించి ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాల అమలు విషయంలో చొరవ చూపాలని, లేకపోతే ప్రజా ఉద్యమాల సెగ తాకుతుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement