ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రజలు తమ ఫలితం నిర్ణయించేశారన్నారు ప్రధాని మోదీ. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ దుష్ఠపాలనలో తెలంగాణ రాష్ట్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు.
పదేళ్లుగా తెలంగాణ ప్రజల కలలను భారాస, కాంగ్రెస్ చిదిమేశాయి. ఇన్నేళ్లు భారాస అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోంది. భారాస, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయింది. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్‌కు ఈ ఐదేళ్లు చాలని ప్రధాని దుయ్యబట్టారు. ఇప్పుడు ఈ రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిందన్నారు. కాంగ్రెస్ దుర దృష్టి అంతా.. తెలంగాణపై ఉందన్నారు. తెలంగాణను నాశనం చేయడానికి కాంగ్రెస్‌కు ఐదేళ్లు కూడా పట్టదన్నారు. తెలంగాణను కాంగ్రెస్ ఎప్పుడూ అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలనతో మోసం, దోపిడీ తప్ప ఏదీ లేదన్నారు. కాంగ్రెస్ చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు.
గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చిన కాంగ్రెస్ .. పేదరికాన్ని తొలగించిందా ? అని ప్రశ్నించారు మోదీ. భారత్‌లో మోదీ వచ్చాక.. మార్పు వచ్చిందన్నారు. మోదీకి ప్రజలు తమకు సేవ చేసే అవకాశం కల్పించారన్నారు. మార్పుకు ఒకే ఒక గ్యారంటీ ఉందని.. అదే మోదీ గ్యారంటీ అన్నారు.. ప్రధాని. పదేళ్లలో దేశంలో తొలిసారిగా.. పేదలకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యిందన్నారు. పేదలకు మంచినీరు, ఉచిత విద్యుత్, ఫ్రీ వ్యాక్సిన్.. చేరాయన్నారు. అందుకే అన్ని చోట్ల కూడా కమలం వికసించేలా తెలంగాణ ప్రజలు.. ఓట్లు వేసి గెలిపించాలన్నారు.
”భాజపాను గెలిపించండి.. మీ ఆకాంక్షలను నేరవేరుస్తాం. మీ అభివృద్ధి కోసం నేను రాత్రి, పగలూ పనిచేస్తాను. నిన్న మల్కాజిగిరిలో ప్రజలు వీధుల్లో బారులు తీరి మద్దతు తెలిపారు. మా పార్టీ ఎంపీలను భారీ సంఖ్యలో గెలిపిస్తే అప్పుడు కాంగ్రెస్ ఆటలు సాగవు. ఆ పార్టీ ‘గరీబీ హఠావో’ అని దశాబ్దాల క్రితమే నినాదం ఇచ్చింది. కానీ పేదరికం పోయిందా? కాంగ్రెస్ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది. భాజపాకు పూర్తి మెజారిటీ ఇచ్చిన తర్వాతే దేశంలో మార్పు మొదలైంది. మార్పునకు గ్యారంటీ.. మోదీ గ్యారంటీ మాత్రమే. నేను నా కోసం.. ఒక్కరోజు కూడా వినియోగించుకోలేదు. రేయింబవళ్లు 140 కోట్ల ప్రజల కోసమే పని చేస్తున్నాను. ఆర్టికల్ 370, అయోధ్య రామాలయం నిర్మాణం ఇందుకు కొన్ని ఉదాహరణలు” అని మోదీ తెలిపారు.