Tuesday, October 22, 2024

TS: మేడారం జాత‌ర‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి… మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఉమ్మడి కరీంనగర్, ప్రభన్యూస్ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టీఎస్ఆర్టీసీ అన్నీ ఏర్పాట్లు చేసిందని రవాణా,బీసీ సంక్షేమ శాఖల‌ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహా జాతర జరుగుతుండగా భక్తుల రద్దీ దృష్ట్యా 25వ తేది వరకు 6 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపుతోందని తెలిపారు.

గతంలో కంటే ఈసారి ఎక్కువ‌ బస్సులు జాతరకు వెళ్తుండడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సాధారణ ప్రయాణికులకు కొంత బస్సులు తగ్గే అవకాశం ఉంద‌ని, ప్రజలు అసౌకర్యానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఈ జాతరకు అందుబాటులో ఉన్నందున.. ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో దాదాపు 40 లక్షల మంది వరకు భక్తులు ఆర్టీసీ బస్సుల్లో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారని సంస్థ అంచనా వేస్తోందన్నారు. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు పెద్ద సంఖ్యలో 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement