వికారాబాద్ (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్డు అయిన ఎన్టీఆర్ చౌరస్తా నుండి బీజే ఆర్ చౌరస్తా వరకు ఉన్న రోడ్డు ఇబ్బంకరంగా మారింది. ఈ రోడ్డు మార్గమధ్యంలో డివైడర్లు ఏర్పాటు చేయకపొవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధాన మార్గమైన ఈ రోడ్డును వెడల్పు చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల డివైడర్ ను ఏర్పాటు చేయలేకపోయారు. హైదరాబాద్ మార్గంలోని మహావీర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు డివైడర్ ఏర్పాటు చేసి వీధి దీపాలు ఏర్పాటు చేశారు. అయితే, ఎన్టీఆర్ చౌరస్తా నుండి బీజేఆర్ చౌరస్తా వరకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ చొరవ తీసుకొని రోడ్డు డివైడర్ ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఆనంద్, మున్సిపల్ చైర్మన్ గా మంజుల ఉన్నప్పటికీ ఈ రోడ్డు పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..