Friday, November 22, 2024

57 ఏళ్లకే పెన్షన్‌, ఈ ఏడాది నుంచి అమలు

వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు విధించిన వయోపరిమితిని తమ ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిందని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్ధిదారులకు ఈ పింఛన్లను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ.11,728 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు.

2014లో ఆసరా పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 29,21,828 ఉందని, ప్రస్తుతం ఈ సంఖ్య 38 లక్షల 41వేలని పేర్కొన్నారు. గడిచిన ఏడున్నరేళ్లలో ఆసరా పింఛన్ల అమలుకు ప్రభుత్వం రూ.46,660 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement