నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదీ పరివాహాక ప్రాంతాలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. గోదావరి ఉప నదులు ప్రాణహిత, పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పెన్‌గంగ మహోగ్రరూపం దాల్చింది. జైనథ్ మండలంలోని డోలారా వద్ద రహదారిని ముంచెత్తింది..
పెన్ గంగ వరద నీరు 50 అడుగులు ఎత్తున ఉన్న వంతెనను తాకాయి. దీంతో 44వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గిన తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు. గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పెరుగుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ పరుగులు పెడుతోంది.