Tuesday, November 26, 2024

ఎయిర్ పోర్ట్ మెట్రో ఎప్పుడు?

హైదరాబాద్‌, : దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో మెట్రో రైలు సేవలు విస్తరిస్తుండడం, ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ మెట్రో రైలు పనులు చురు గ్గా పట్టాలెక్కుతుంటే ఢిల్లీ మెట్రో తర్వాత అతి పెద్దదైన హైదరాబాద్‌ మెట్రో మాత్రం విస్తరణకు నోచుకోవడం లేదు. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లోనూ చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో మెట్రో రైలు సేవల విస్తరణకు వేల కోట్ల రూపాయల నిధులిచ్చిన కేంద్రం హైదరా బాద్‌ మెట్రో విస్తరణపై మాత్రం ఊసెత్తలేదు. గచ్చి బౌలి నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమా నాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పట్టిం చుకోని కేంద్ర పెద్దలు తాజాగా ఆ అంశాన్ని రాజకీయం చేసే పనిలో పడ్డారని పలువురు విశ్లేషిస్తున్నారు. మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించడం లేదని, విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి నిధులివ్వడం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు వాదిస్తుంటే ముందు పాత బస్తీలోని ఫలక్‌నుమా నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో పనులు పూర్తి చేయాలని కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ అధికార టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెడుతోంది. ఈ అంశం రాజకీయంగా మారడమే టీఆర్‌ఎస్‌ మౌనానికి కారణమని పలువురు అభిప్రా యపడుతు న్నారు. ఏదేమైనా ఎయిర్‌పోర్టుకు లైను వేయకుండా దేశంలోనే రెండవ అతి పెద్ద మెట్రో రైలు సర్వీసుల నిర్మాణం పీపీపీ పద్ధతిలో పూర్తి అయిన హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు మాత్రం నోచుకోకపోవడం బాధా కరమని పలువురు నగర వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విస్తరణలో మాత్రం ఆఖరు…
ఒకేసారి 66 కిలోమీటర్ల రూట్‌లో నిర్మించిన హైదరాబాద్‌ మెట్రో ఢిల్లీ మెట్రో తర్వాత దేశంలో రెండో అతిపెద్దదైనప్పటికీ విస్తరణలో మాత్రం దేశం లోని ప్రస్తుత మెట్రో నిర్మాణాలు పూర్తయితే ఆఖరున నిలిచే అవకాశముందని పలువురు పురపాలక శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్పటికే 347 కిలొ మీటర్ల రూట్‌ కవర్‌ చేస్తున్న ఢిల్లీ మెట్రో మరో 100 కిలోమీటర్ల మేర తన రూట్‌ కవరేజిని విస్తరిస్తోందని, అంటే అగ్రభాగాన ఉన్న ఢిల్లీ మెట్రోకు, హైదరాబాద్‌ మెట్రోకు తేడా ఎంత మేర ఉందో ఇట్టే అర్థం చేసు కోవచ్చని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 700 కిలోమీటర్లపైన మెట్రో సర్వీసులు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా రానున్న రోజుల్లో మరో 1000 కిలోమీటర్లపైగా మెట్రో రైలు సేవలు నిర్మాణంలో ఉన్నాయని, ఈ లెక్కన చూసుకుంటే లక్నో, ఇండోర్‌, భోపాల్‌, ఆగ్రా, అహ్మదాబాద్‌, మీరట్‌ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలు కూడా త్వరలో మెట్రో రూట్‌ పొడవులో హైదరాబాద్‌ను మెట్రోను మించి పోయినా ఆశ్చర్యం లేదని వారు పేర్కొంటున్నారు. ఉత్తర, మధ్య భారత దేశాల్లోని ప్రతి నగరం మెట్రో ఏర్పాటు లేదా విస్తరణపై దృష్టి సారించి కేంద్రం నుంచి పలు మార్గాల్లో నిధులు తెచ్చుకుంటుంటే దక్షి ణాదిలోని ఏపీ, తెలంగాణలు మాత్రం ఈ విష యంలో చాలా వెనుకబడిపోయాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు రూ.9వేల కోట్లతో మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు సంబం ధించి డీటెయిల్ట్‌ ప్రాజెక్టను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే కేంద్రం నుంచి దీనిపై ఎలాంటి సంకేతాలు లేకపోగా ఫలక్‌నుమా నుంచి ఎంజీబీఎస్‌ లైను ముందు పూర్తి చేయండని ఇటీవల కేంద్ర సహాయకమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మొదటి దశ మెట్రోకు రూ.1450 కోట్ల రూపాయల దాకా వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల మెట్రోలకు సహాయం పట్ల రూట్‌ మార్చిందని వారు చెబుతున్నారు. ఇందులో ఈక్విటీలో వాటా కంటే కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు ఇప్పించే పద్ధతిలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు అనువుగా ఉంటోందని అధికారులు వివరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement