Tuesday, November 26, 2024

Pending challans | గడువు మరో నాలుగు రోజులే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వాహనాల రాయితీ పెండింగ్‌ చలాన్ల ద్వారా ఇప్పటివరకు రూ.135 కోట్ల మేరకు ఆదాయం సమకూరిందని, చలాన్ల చెల్లింపులకు మరో నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలిందని పోలీసులు వివరిస్తున్నారు. కాగా ఇప్పటికే పెండింగ్‌ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉండగా ఇప్పటి వరకు 1,52,47,864 మంది చలాన్లు చెల్లించారు.

ఇప్పటి వరకు 42.38శాతం మాత్రమే చలాన్లకు చెల్లింపులు జరిగాయి వాటి ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ.34కోట్లు, సైబరాబాద్‌ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ పరిధిలో రూ.16 కోట్లు ఆదాయం సమకూరిందని తెలిపారు. రాయితీపై చెల్లించేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు మాత్రమే ఉందని ఈ లోగా వాహనదారులు చలాన్లు చెల్లించాలని పోలీసులకు సూచించారు.

గతేడాది డిసెంబర్‌ 27నుంచి పెండింగ్‌ చలాన్లు చెల్లించేందుకు 15 రోజుల పాటు- అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. చలాన్ల చెల్లింపుల విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తగా ఈ నెల 31 వరకు పొడిగింది. గడువు ముగిసిన తర్వాత మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement