Wednesday, November 20, 2024

విజయవంతంగా పీడియాట్రిక్‌ ట్రాన్స్‌ కాథెటర్‌ ఇంప్లాంటేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ట్రాన్స్‌ కాథెటర్‌ పల్మనరీ వాల్వ్‌ ఇంప్లాంటేషన్‌ను అపోలో పీడియాట్రిక్‌ కార్డియాలజిస్టులు విజయవంతంగా నిర్వహించారు. గుండెలో ఆక్సిజన్‌ ఉన్న, లేని రక్తం కలిసిపోతుండటంతో గుండె వైఫల్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల ఓ ఇంజీనిరంగ్‌ విద్యార్థికి ఈ అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు.

సాధారనంగా 18ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారిలో ఈ తరహా చికిత్సను చేయరు. అయితే మొదటిసారిగా అపోలో వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. శస్త్ర చికిత్స చేసిన మరుసటి రోజే రోగి కోలుకోవటంతో అతడిని డిశ్చార్జి చేశారు. ఈ ఆపరేషన్‌లో వైద్యులు డాక్ట‌ర్‌ చింతల కవిత, డాక్ట‌ర్‌ మనోజ్‌ అగర్వాల్‌, డాక్ట‌ర్‌ రూఫస్‌ డెమెల్‌లతో కూడిన పీడీయాట్రిక్‌ కార్డియాలజీ బృందం పాల్గొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement