పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై బురద చల్లే యత్నం చేస్తున్నారని మండల టీఆర్ఎస్ నాయకులు అన్నారు. మండలంలోని మడక గ్రామంలో శుక్రవారం జరిగిన మోసపూరిత సమావేశానికి టీఆర్ఎస్ పార్టీకి సంబందం లేదని ఓదెల మండల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు కొందరు టిఆర్ఎస్ పార్టీ నాయకులను విందు పేరుతో నమ్మించి మోసం చేసారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని చేసినా ముచ్చటగా మూడోసారి పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి ఘనవిజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు.
మరోవైపు తతను ఉపసర్పంచ్ ల మీటింగ్ అని తప్పుదారి పట్టించి పిలిచారని భీమరిపల్లి ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాను టీఆర్ఎస్ లోనే ఉంటానని, ఎమ్మెల్యే దాసరి వెంటే నడుస్తానని తెలిపారు.