Thursday, December 12, 2024

Peddapalli – చలో హైదరాబాద్ – సర్పంచుల అరెస్ట్ ..

పెద్దపల్లి, ఆంధ్రప్రభ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ లు చలో హైదరాబాద్ తలపెట్టిన నేపథ్యంలో మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లకు తరలించారు. సోమవారం తెల్లవారుజాము నుండి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మాజీ సర్పంచ్లను పోలీసులు ఇండ్ల వద్దనే అరెస్టు చేసి ఠాణా లకు తరలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న తమకు చెల్లించాల్సిన బిల్లులు అందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. తమ బిల్లులు అందించాలని డిమాండ్ చేస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. బిల్లులు మంజూరు చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement