Tuesday, December 17, 2024

Peddapalli – “ఫ్రీ” అంటే ఇట్టాగుంటాది !!!

పెద్దపల్లి ఆంధ్రప్రభ కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి.. కానీ పెద్దపల్లిలో మాత్రం ఉచితంగా అందిస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం. మంగళవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందజేశారు.

ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంచులు సంచులుగా కూరగాయలు తీసుకొనివెళ్ళారు. అసలు విషయం ఏంటంటే కూరగాయల మార్కెట్లో హోల్సేల్, రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య వివాదం నెలకొనడంతో రిటైల్ వ్యాపారులు ఉచితంగా కూరగాయలు అందజేశారు.

ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్ గా కూరగాయలు అమ్మ వద్దని ఉండగా వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండడంతో ఆగ్రహించిన రిటెయిల్ వ్యాపారులు మంగళవారం కూరగాయలన్నీ ఫ్రీగా పంచిపెట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement