Saturday, November 23, 2024

Peddapalli – ప్రజాపాలనలో పేదలందరికి సంక్షేమ పధకాలు .. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి (ప్రభ న్యూస్) ప్రజా పాలనలో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్, సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి, గ కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు 6 గ్యారంటీల హామీల అమలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని, ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకం అందించడమే మా లక్ష్యమన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరోగ్య శ్రీ 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంపు మరియు మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం రెండు హామీలను నెరవేర్చామని, అలాగే అధికారులంతా ఇది మా ప్రభుత్వం పేదల ప్రభుత్వమనే ఆలోచనతో పనిచేయాలని తెలిపారు.

అలాగే రేషన్ కార్డు లేని వారు అభయహస్తం గ్యారంటీ దరఖాస్తతో పాటు రేషన్ కార్డు దరఖాస్తు పత్రాన్ని జత చేసి స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులకు ఇవ్వాలన్నారు. ప్రజా పాలనకి వచ్చే ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజల మనసు గెలుచుకోవాలని, పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న నీరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తానని అలాగే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం అని అలాగే రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సేవకులుగా మారడానికి నాయకులకు ప్రజా పాలన ఒక మంచి అవకాశం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అరుణ్ శ్రీ మరియు స్థానిక జడ్పీటీసీలు,ఎంపీపీలు సర్పంచులు,ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement