ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండి సేవలందిస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలియజేశారు. ఆదివారం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు చేరేలా తమ పనితీరు ఉంటుందన్నారు. ప్రజలు సమస్యలు ఉంటే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హర్షకు కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.
- Advertisement -