Sunday, November 24, 2024

Peddapalli – షార్ట్‌ సర్క్యుట్‌తో తల్లీ కూతుళ్ల సజీవ దహనం –

రామగిరి, అక్టోబర్‌ 29 (ఆంధ్రప్రభ): విద్యుత్‌ షార్ట్‌ సర్య్యుట్‌తో తల్లికూతుళ్లు సజీవ దహనమైన ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. రత్నాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్‌కు చెందిన కొమురమ్మ (60), ఆమె కూతురు పోశమ్మ (40)లు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. ఓ బిర్యానీ సెంటర్‌లో పని చేస్తున్న ఇరువురు రాత్రి విధులు ముగించుకొని ఇంటికి చేరుకొని ఓకే మంచంపై నిద్రపోయారు.

ప్రమాదవశాత్తు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యుట్‌ చోటు చేసుకోవడంతో తల్లికూతుళ్లు ఇద్దరు మంచంపైనే మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. వీరితోపాటు మంచం కింద శునకం కూడా మరణించింది. తల్లి కూతుళ్లు మంటల్లో కాలిపోయి మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

- Advertisement -

రామగిరి ఎస్‌ఐ చంద్రకుమార్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement