ఆంధ్రప్రభ స్మార్ట్, పెద్దపల్లి రూరల్ : ఎందరో పేదలు కంటికి వైద్యం చేయించుకునే స్తోమత లేక కంటి చూపు కోల్పోతున్నారు. అలాంటి వారికి లయన్స్ క్లబ్ విజన్ కేర్ బాసటగా నిలుస్తోందనడంలో సందేహం లేదు. కంటి చూపు కల్పించడంలో పేదలకు విజన్ కేర్ సేవలు అందజేస్తోంది.
మారు మూల పల్లెలు, తండాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమున్నవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేసి, కంటి అద్దాలు సైతం పంపిణీ చేసి పేదల కళ్లల్లో విజన్ కేర్ వెలుగులు నింపుతోంది.
2021 నుంచి సేవలు2021 లయన్స్ క్లబ్ స్థాపించడంలో కట్కూరి సత్యనారాయణ కీలక భూమిక పోషించారు. లయన్స్ క్లబ్ విజన్ కేర్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆస్పత్రి, బెల్లంపల్లి లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రి, చల్మెడ ఆనంద రావు ఆస్పత్రుల్లో నేత్ర శస్త్ర చికిత్సలు చేసి కంటి చూపు ప్రసాదించారు. ఆపరేషన్ చేసిన ఆస్పత్రులకు పారితోషికంగా రెండు వేల రూపాయల చొప్పున డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ చెల్లిస్తుంది. రోగుల నుంచి ఎలాంటి ఫీజు వసూళ్లు చేయకుండా రవాణా, భోజన వసతులు కల్పిస్తున్నారు.ఇలా అందిస్తున్న సేవలు…ఈ దిగువ ఆస్పత్రిల్లో లయన్స్ క్లబ్ విజన్ కేర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ దిగువ వివరించిన ప్రకారం పేదలకు సేవలు అందిస్తున్నారు. అవసరమైన వారికి దాతల సహకారంతో ఆపరేషన్లు, కంటి అద్దాలు అందిస్తామని, తమ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు పూదరి దత్తా గౌడ్ కోరారు.
ప్రతి రోజూ మంథనిలో నేత్ర సహాయకులు పూదరి దత్తా గౌడ్, లక్షెట్టిపేటలో నేత్ర సహాయకులు సయ్యద్ ఇలియాస్, బుద్దార్తి సతీష్ కుమార్ ప్రతి సోమవారం జమ్మికుంటలో షాకీర్, ప్రతి మంగళవారం పరకాలలో మాదాసు లావణ్య, ప్రతి బుధవారం కోరుట్లలో ముబీన్, ప్రతి గురువారం పెద్దపల్లిలో అబ్దుల్ వాసే, ప్రతి శుక్రవారం నిర్మల్ ఖానాపూర్ లో బొగే సాయి నిఖిల్, ప్రతి శనివారం ఆసిఫాబాద్ లో ఆకుల మల్లేష్, ప్రతి ఆదివారం కరీంనగర్ కొత్తపల్లిలో నేత్ర సహాయకులు మాదర్ ఖాన్ 62,345 మందికి కంటి పరీక్షలులయన్స్ క్లబ్ విజన్ కేర్ ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో సేవలు అందిస్తున్నారు.
ఇందులో 23 మంది నేత్ర సహాయకులు 2021 నుండి ఇప్పటి వరకు 62,345 మందికి కంటి పరీక్షలు చేయగా అవసరమున్న వారిని గుర్తించి 5152 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. 20,432 మందికి ఉచితంగానే కంటి అద్దాలు పంపిణీ చేశారు.
ఇందులో ఎక్కువ సంఖ్యలో రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేసి అద్దాలు అందించారు. చల్మెడ ఆనంద రావు, బెల్లంపల్లి లయన్స్ కంటి ఆసుపత్రుల్లో మరిని శస్త్ర చికిత్సలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేశారు.
సేవే లక్ష్యంగా విజన్ కేర్దత్తా గౌడ్, వ్యవస్థాపక అధ్యక్షులుపేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో విజన్ కేర్ స్థాపించాం. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి కంటి చూపు మందగించిన వారిని గుర్తిస్తున్నాం. వారికి ఇష్టముంటే మేమే బస్ సౌకర్యం, భోజన వసతి కల్పించి కంటి ఆపరేషన్లు చేయిస్తాం. ఎవరైనా కంటి ఆపరేషన్లు చేసుకోవాలంటే నేరుగా కూడా సంప్రదించవచ్చు. మంథని, లక్షెట్టిపేటలో నిత్యం నేత్ర సహాయకులు అందుబాటులో ఉంటారు.
విజయవంతంగా కంటి ఆపరేషన్లు చిదురు సురేష్, వైస్ చైర్మన్ రేకుర్తి ఆసుపత్రి.
రేకుర్తి ఆసుపత్రిలో విజయవంతంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నాం. కార్పొరేట్ హాస్పిటల్లకు ధీటుగా సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు ఉచితంగా మెరుగైన ఐ సేవలు అందిస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే కంటి ఆపరేషన్లపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయడం ద్వారా మరింత మందికి మా సేవలు చేరుతాయి.