Friday, September 20, 2024

Peddapalli – బఫర్ జోన్ వెంచర్ పై ఇరిగేషన్ కొరడా..


.. హద్దు రాళ్లు తొలగించాల్సిందే
.. ఎర్రజెండాలు పాతిన అధికారులు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ – చెరువులు, కుంటల ఆక్రమణలు ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో జిల్లాల్లో అధికారులు హైడ్రా తరహా సర్వేలు నిర్వహించి బఫర్ జోన్లలో నిర్మాణాలపై కొరడా జూలూపిస్తున్నారు. తాజాగా శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని గుండమ్మ చెరువు బఫర్ జోన్ లో వెంచర్ ఏర్పాటు చేశారని జిల్లా ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణల తొలగింపు కు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు.

- Advertisement -

గుండమ్మ చెరువు బఫర్ జోన్ లో వెంచర్ కాంపౌండ్ హద్దురాళ్ళు తొలగించాలని, సర్వే ప్రకారం ఎర్రజెండాలను పాతారు. దాదాపు 30 ఫీట్లు హద్దురాళ్ళు వెనక్కి వేసుకోవాలని వెంటనే కాంపౌండ్ హద్దురాల్లను తొలగించాలని సూచించారు. వెంచర్ నిర్వాహకులు స్వచ్చందంగా తొలగించకపోతే తామే తొలగిస్తామని అధికారులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement