సుల్తానాబాద్, ఆంధ్రప్రభ – ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించిన 33.10 లక్షల రూపాయల నగదును పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించిన నగదు ను తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు సుల్తానాబాద్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించి నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు ను తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఒకరు కాకినాడ కు చెందిన వ్యక్తిగా మరో ఇద్దరు జిల్లాలోని గోదావరిఖని కి చెందిన వారిగా గుర్తించారు.
ఆన్లైన్ బెట్టింగ్ ప్రేరేపించడం వల్ల సదరు యువకులకు బెట్టింగ్ యాప్ నుండి యూఎస్ డాలర్ల రూపంలో చెల్లించగా వాటిని హైదరాబాదులో ఇండియన్ కరెన్సీ కి మార్చుకొని 33 లక్షల రూపాయల నగదు ను గోదావరిఖనికి తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.