కెసిఆర్ భరోసా వైపే ప్రజలందరూ ముగ్గు చూపుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల గ్రామంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గూలాబీ గూటిలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మడం లేదని కేసీఆర్ భరోసా లో పొందుపరిచిన 17 హామీల నే ప్రజలు నమ్ముతున్నారన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని డ్రామాలు ఆడిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బారాస అధికారంలోకి రాగానే 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందుతుందని, ఆసరా పింఛన్ 5000 కు పెరుగుతుందని, వికలాంగుల పింఛన్ 6000 కు పెంచుతామని, తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. హైటెక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని పెద్దపల్లిలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగురుతుందన్నారు.
బారాస లో వార్డు మెంబర్ అర్కుటీ లావణ్య రవి, బీజేపీ యూత్ అధ్యక్షులు గుంటి సాయి,కార్యదర్శి ఎనగందుల అనిల్, అర్కుటి అవినాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుంటి సదయ్య, గంట్ అంజయ్య, కుమార్ ,ఐలయ్య, రాజయ్య, దేవేందర్,దీపక్, బీజేపీ కుందారపు రమేష్,చింటు, మనోహర్,రామకృష్ణ, సతీష్,శంబు, దేవా, నర్సింహా, ఉదయ్, సాయి, విష్ణు, జీతన్, కాంగ్రెస్ గణేష్, సన్నీ, కృష్ణ, నారాయణ లు చేరగా ఎమ్మెల్యే దాసరి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి కో ఆర్డినేటర్ పాల రామారావు, ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మండల రైతు కో ఆర్డినేటర్ బోయిని రాజమల్లయ్య ,మండల యూత్ అధ్యక్షుడు గుడుగుల సతీష్,సర్పంచ్ ఎరుకొండ రమేష్, ఎంపీటీసీ సంపత్, ఉప సర్పంచ్ అరుణ -మొండయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు భూమయ్య,మాజీ సర్పంచ్ అంజయ్య, వార్డు మెంబర్ లు ఎరుకొండ తిరుపతి, బండి తిరుపతి, కుమార్, యూత్ అధ్యక్షులు హరీష్, కనుకయ్య, సంజీవ్, అజయ్, ఓదెలు,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.