Tuesday, November 19, 2024

నేర రహిత గ్రామాలే లక్ష్యం: పెద్దపల్లి ఏసీపీ

నేర రహిత గ్రామాలే లక్ష్యంగా కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని పెద్దపల్లి ఏసీపీ సారంగపాని అన్నారు. రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో గురువారం కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ.. ప్రజలు రక్షణ పరంగా తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరస్తులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా? అనే విషయంపై ఆరా తీశారు.  కూడా తెలుస్తుందన్నారు. 

గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ తిరుగుతున్న వారిపై పోలీసులు ఫిర్యాదు చేయాలన్నారు. గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుడుంబా,గుట్కాలు అమ్ముతున్నా, పేకాట ఆడిన వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలన్నారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకోవాలని ఏసీపీ చెప్పారు.

నేనుసైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలోని ప్రజలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పోలీస్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ఏపీపీ కోరారు. కోవిడ్, ఒమిక్రాన్ మళ్లీ విజంభిస్తున్నా దృష్ట్యా అందరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలు  నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఏసీపీ సారంగపాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement