పెద్దపల్లి, ఆంధ్రప్రభ పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుంటానని వ్యక్తి హల్చల్ చేసిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ రెహ్మాన్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేశాడు.
అర్ధరాత్రి పోలీసులు వచ్చి తన ఆటో తీసుకువచ్చారని, తాను ఏం నేరం చేశానని, ఎందుకు ఆటో తీసుకువచ్చారని ఒక దొంగలా తనను వీడియో తీశారని ఆరోపించాడు. అప్రమత్తమైన పోలీసులు రెహమాన్ ను సముదాయించి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లారు. ఒక దొంగతనం కేసులో ఆటో తీసుకువచ్చినట్లు సమాచారం.
- Advertisement -