మంచు ఫ్యామిలీ వివాదంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. రిపోర్టర్ పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. వందల సినిమాల్లో నటించి.. జాతీయ అవార్టులు పొందిన ఆయన, ఎంపీగా పనిచేసిన వ్యక్తి, జర్నలిస్టులపై వ్యవహరించిన తీరు దారుణమన్నారు.
ఢిల్లీలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ….అయ్యప్ప మాలలో రిపోర్టర్ రంజిత్ ఉన్నాడన్న విషయం కూడా గ్రహించకుండా ఇష్టమొచ్చినట్టు దాడి చేశారని అన్నారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై, సంస్థపై జరిగిన దాడిగా చూడొద్దని కోరారు. మొత్తం మీడియాపై జరిగిన దాడిగా చూడాలన్నారు. అలాగే మోహన్ బాబుపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.