Friday, November 22, 2024

Peace Talks – రాజ‌య్య‌కు కెటిఆర్ క్లాసు – కడియం గురించి ఇక‌పై మాట్లాడ‌న‌న్న ఎమ్మెల్యే ..

హైదరాబాద్‌:స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలో సీనియర్‌ నేతల నడుమ జరుగుతున్న మాటల యుద్ధంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. మంగళవారం మధ్యాహ్నాం ప్రగతి భవన్‌లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కేటీఆర్‌ సమావేశమై ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించారు.
గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్‌ కడియం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయపరంగానే కాదు.. వ్యక్తిగత విమర్శలకు సైతం ఇద్దరూ వెనుకాడడం లేదు. ఈ తరుణంలో పార్టీ పరువును బజారుకీడ్చడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ ఇవాళ్టి భేటీలో ప్రస్తావించినట్లు స‌మాచారం.

ఈ సందర్భంలో రాజయ్యను మందలించిన ఆయన.. ఇంకోసారి అలాంటి పని చేయొద్దని వారించినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్‌ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ”ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఇంతటితో ఈ వివాదం ముగించాలని, ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని.. లేకుంటే తీవ​ పరిణామాలు ఉంటాయ”ని కేటీఆర్‌ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం. మరోవైపు ఆయన కడియంతోనూ భేటీ కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, కెటిఆర్ ను క‌ల‌సిన అనంత‌రం రాజ‌య్య మీడియాతో మాట్లాడుతూ, కడియం శ్రీహరిని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని కేటీఆర్ కు వివరించాన్నారు.. . కడియం శ్రీహరి తల్లిని అవమానించేలా తాను వ్యాఖ్యలు చేయలేదని రాజయ్య తెలిపారు. మరో వైపు కడియం శ్రీహరి అహంతో ప్రతి రోజూ తనపై విమర్శలు చేస్తుంటారన్నారు. ఈ విషయాలన్నీ తాను కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చినట్టుగా రాజయ్య వివరించారు. తనను కడియం శ్రీహరి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తారో కూడ కేటీఆర్ కు వివరించినట్టుగా పేర్కొన్నారు.. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేయాలని కేటీఆర్ సూచించారన్నారు. ఇతర విషయాలన్నీ తమకు వదిలేయాలని కేటీఆర్ సూచించారని రాజయ్య చెప్పారు. . రానున్న రోజుల్లో కడియం శ్రీహరిపై వ్యాఖ్యలు చేయకుండా ముందుకు వెళ్తానని రాజయ్య చెప్పారు.వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement