Monday, November 25, 2024

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్.. నిల్వచేసినా, సప్లయ్​ చేసినా కేసులే!

నకిలీ విత్తనాలు, ఎరువులు, నిషేధిత గడ్డి మందు విక్రయిస్తే పీడీ యాక్ట్ పెడతామని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నకిలీ విత్తనాల విక్రయ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతులను మోసం చేసే వారిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జిల్లాకు నకిలీ విత్తనాలు వస్తున్నాయనే సమాచారం ఉందన్నారు. హెచ్ టి కాటన్ విక్రయాలకు అనుమతి లేదన్నారు. మోసగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

విత్తనాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, నకిలీ విత్తనాలు విక్రయించినా, అక్రమంగా నిల్వ ఉంచినా, రవాణా చేసినా నకిలీ దందాగానే ప రిగణిస్తామని చెప్పారు. కొనుగోలు చేసిన విత్త నాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు డీలర్ల నుంచి రశీదులు తీసుకోవాలని సూచించారు. నకిలీ పత్తి విత్తనాలు ఉపయోగిస్తే భూసారం దెబ్బతింటుందని, ప్రభుత్వం ఆమోదించిన పత్తి విత్తనాలు మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల సమాచారం తెలిస్తే వెంటనే వ్యవసాయ అధికారులు గాని పోలీస్ అధికారులు గాని తెలియజేయాలని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కచ్చితంగా ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని లేకపోతే జనాలు తప్పవన్నారు.ఈ సమావేశంలో సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్, మునిసిపల్ చైర్ పర్సన్ ముఖ్యం సునీత తోపాటు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement