హైదరాబాద్, ప్రభన్యూస్ : రేషన్ బియ్యం అక్రమ ”దందా” చేసే అక్రమార్కులపై పి.డియాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. శనివారంనాడు ఆయన ఆమన్‌గల్‌లో రైస్ మిల్లులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రఘు నందన్ మాట్లాడుతూ కొన్ని రైస్ మిల్లులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేస్తున్నాయన్న సమాచారం ఉందన్నారు. వడ్ల మాటున రేషన్ బియ్యం బస్తాలను దాచి, ఆ తర్వాత వాటిని నూకలుగా మార్చి విక్రయిస్తున్నారన్న సమాచారం తెలిసిందని చెప్పారు. అలా రేషన్ బియ్యంతో దందా చేసే మిల్లులకు తాళం పడటం ఖాయం అని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం చేరవేసేవారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
- Advertisement -