Saturday, November 23, 2024

ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచండి: ఉత్తమ్

కొవిడ్ సంక్షోభాన్ని అడ్డుకట్ట వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆర్టీపీసీఆర్ పరీక్షలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. జిల్లా కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు. అందులో తప్పుడు ఫలితాలు వస్తున్నాయి తెలిపారు. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదని ప్రభుత్వాన్ని ఉత్తమ్ ప్రశ్నించారు. వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించి ప్రజల ప్రాణాలు కపాడాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీఆర్ మిషన్ లను తెలంగాణలోని 33 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇచ్చేందుకు సిద్దమైన ప్రభుత్వం… ప్రజల  కోసం ఆరు కోట్లతో ఆర్టీపీసీఆర్ మిషన్ లను కోనుగోలు చేయలేదా? అని ఉత్తమ్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement