Wednesday, December 4, 2024

TG | కాలుష్య వ్య‌ర్థాల‌ విడుద‌ల.. రుద్ర టెక్నాల‌జీ మూసివేతకు పీసీబీ ఆదేశం..

కాలుష్య వ్య‌ర్థాల‌ను విడుద‌ల చేస్తున్న రుద్ర టెక్నాల‌జీ ప‌రిశ్ర‌మ‌ను మూసివేయాల‌ని కాలుష్య నియంత్రణ మండలి నేడు ఆదేశాలు జారీ చేసింది. వివరాలలోకి వెళితే… అత్తాపూర్ బాపు ఘాట్ బ్రిడ్జి వద్ద కెమికల్ వ్యర్థాలను మూసీనదిలో కలుపుతున్న ట్యాంకర్లను స్థానికులు నెల 26వ తేదిన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాండూర్, పటాన్ చెరు, షాద్ నగర్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను తీసుకువచ్చి ఈ ప్రాంతంలో డంప్ చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. మూసీ వెంబడి ఖాళీ స్థలాన్ని కబ్జా చేసిన కొంతమంది వ్యక్తులు.. అక్కడ ఇసుక వ్యాపారం, లారీల పార్కింగ్ పెట్టారు. వాటి మాటున ఎవ్వరికీ అనుమానం రాకుండా నదిలో వ్యర్థాలు కలుపుతున్నారు.

ఇదే క్ర‌మంలో కెమికల్ వ్యర్థాలు ఖాళీ చేస్తున్న లారీని మాత్రం పట్టుకోగలికారు. స‌మాచారాన్ని పోలీసుల‌కు, కాలుష్య నియంత్ర‌ణ మండలికి ఫిర్యాదు చేశారు స్థానికులు.. అధికారులు అక్కడికి వచ్చి ఎపి 28 టిడి 4699 నెంబ‌ర్ ట్యాంక‌ర్ ను సీజ్ చేశారు. ఇందులోని డ్రైవ‌ర్ ను అదుపులోకి తీసుకున్నారు.. అత‌డి నుంచి సేక‌రించిన వివ‌రాల అధారంగా రుద్రా టెక్నాల‌జీస్ (శ్రీనివాస ల్యాబ్స్ ) ఈ వ్య‌ర్ధాల‌ను మూసిలో గ‌త కొంత కాలంగా క‌లుపుతున్న‌ట్లు తేలింది. భారీ ట్యాంకర్ కావడంతో ట్రిప్పునకు రూ.25వేలు చెల్లిస్తున్నట్లు డ్రైవర్ వెల్ల‌డించాడు., ఒక్కో ట్యాంకర్‌లో 20వేల లీటర్ల వ్యర్థాలు పడతాయని, అలాంటివి రోజుకు 10ట్యాంకర్లు వస్తున్నట్లు కాలుష్య నియంత్ర మండ‌లి అధికారులు గుర్తించారు.

ఈ నేప‌థ్యంలోనే రుద్రా టెక్నాల‌జీస్ (శ్రీనివాస ల్యాబ్స్ ) కు కాలుష్య నివార‌ణ మండ‌లి నోటీసులు జారీ చేసింది.. వారి నుంచి సంతృప్తిక‌ర స‌మాధానం రాక‌పోవ‌డంతో రుద్రా టెక్నాల‌జీస్ ను వెంట‌నే మూసి వేయ‌వ‌ల‌సిందిగా అధికారులు ఆదేశాఉ జారీ చేశారు.. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తుంద‌ని పిసిపి నేడు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement