Friday, September 20, 2024

Payments – మ‌ళ్లీ ఫోన్ పే లో విద్యుత్ చెల్లింపులు….

యు ట‌ర్న్ తీసుకున్న విద్యుత్ సంస్థ‌లు
కొత్త విధానంలో 40 శాతానికి ప‌డిపోయిన వసూళ్లు
తెలంగాణ‌, ఎపిలోనూ మ‌ళ్లీ ఆన్ లైన్ కు ఓకే

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ వినించాయి ఆ శాఖ‌లు . మళ్లీ యూపీఐ పేమెంట్స్ ను స్వీకరిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. జులై 1 నుంచి ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో మార్పులు వచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

దీనిలో భాగంగానే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లించడం నిలిపివేసినట్లు ఇటు తెలంగాణ ,అటు ఎపి విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. కరెంట్ బిల్లుల చెల్లింపులను స్పీడప్ చేసేందుకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ లో చేరాయి. దాని ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాల‌ని వినియోగ‌దారుల‌ను కోరాయి. అయితే ఈ కొత్త విధానం అర్ధంకాక గ‌త నెల‌లో కేవ‌లం 40 శాతం బిల్లులు మాత్ర‌మే వ‌సూలు అయ్యాయి.. ఇక గ్రామీణ ప్రాంతాల‌లో అయితే విద్యుత్ బిల్లులు కేంద్రాల వ‌ద్ద వినియోగ‌దారులు బారులు తీరారు.. ప‌రిస్థితిని గ‌మ‌నించిన విద్యుత్ బోర్డులో తిరిగి పాత విదానాన్ని అమ‌లు చేస్తునట్లు ప్ర‌క‌టించాయి.. త్వరలోనే గూగుల్ పే తోపాటు మరిన్ని యూపీఏ పేమెంట్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement