.నిజామాబాద్ సిటీ, ఆగస్ట్ (ప్రభ న్యూస్)23: b నిజామాబాద్ మున్సిపాలిటీ బోధన్ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే చెల్లించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నగేష్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజాంబాద్ మున్సిపాలిటీ సంబంధించి రూపాయలు 10 కోట్లు, బోధనకు సంబంధించి రూపాయలు 9:30 కోట్లు, మొత్తం 20 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. మున్సిపల్ అధికారులు చెక్కులు ఇచ్చిన గాని, జిల్లా కోశాధికారి కార్యాలయంలో బిల్లులు మంజూరు కావడం లే లేదన్నారు. ఇటీవల ఎడపల్లి చెందిన కాంట్రాక్టర్ బిల్లులు రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో కాంట్రాక్టర్ గుండెపోటుతో హైదరాబాదులో ఆసుపత్రిలో చేరాడు . లక్షలు పెట్టి ప్రభుత్వం చేపట్టిన పనులు చేపడం జరుగుతుందని తెలిపారు.
బిల్లులు సకాలంలో రాక వడ్డీలకు మరింత భారం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే బిల్లులను మంజూరు చేయించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు మహమ్మద్ ముసేబ్, జావిద్ అలీ, అనిల్, కోటేశ్వరరావు ఫారుక్ శ్రీనివాస్ , ఉదయ భాస్కర్ మారయ్య షబ్బీర్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు