సిరిసిల్ల, ఆంధ్రప్రభ : చేనేత కళాకారులకు పెట్టింది పేరు సిరిసిల్ల. సూది మొనలోంచి దూరే చీర నుండి మొదలుకొని అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను తయారు చేసిన ఘనత సిరిసిల్ల చేనేత కళాకారులది.
సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో ఓ చిన్ని మగ్గాన్ని తయారు చేసి దానిపైనే నేత రూపంలో అచ్చుగుద్దినట్లుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తయారు చేశాడు. ప్రస్తుతం ఈ మగ్గం చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
- Advertisement -