హైదరాబాద్ – సికింద్రాబాద్ లోనినస్వప్నలోక్ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, పాతికేళ్లు నిడకుండానే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు.. పాతికేళ్లు కూడా నిండని నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందటం తనకు ఎంతో ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.. ఉద్యోగం కోసం పొట్ట చేత్తో పట్టుకొని రాజధానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు ఈ ప్రమాదంలో అశువులు బాయడం చాలా బాధించిందని వివరించారు. కాల్ సెంటర్ లో పనిచేస్తున్న వీరంతా దిగువ మధ్యతరగతి కుటుంబాల వారని తెలిసిందని.. అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఎలా బయటపడాలో తెలియక పొగతో ఉక్కిరిబిక్కిరి అయి చివరకు ఆసుపత్రిలో వీరంతా ప్రాణాలు విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు. అనేక కార్యాలయాలు, వాణిజ్య దుకాణాలు ఉన్న స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూలంకషంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలని వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి దీనివల్ల అవకాశం కలుగుతుందని భావిస్తున్నాను. తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని, నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement