తాండూరు బీఆర్ఎస్ వర్గపోరు మరోసారి బయటపడింది. తెలంగాణ భవన్ వేదికగా పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డిని వేదికపై నుంచి దించాలని పట్టుబట్టారు. ఈ రగడలోనే ఎన్నికల వివాదాన్ని తీసుకొచ్చారు పైలెట్ రోహిత్ రెడ్డి వర్గీయులు. పట్నం మహేందర్ రెడ్డి వర్గం తమకు సహకరించలేదని ఆరోపించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
వెంటనే హరీష్ రావు సర్దిచెప్పారు.. ఆ తర్వాత . పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించారు.. బహిరంగంగా గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని హితవు పలికారు.. దీంతో ఇరువర్గాలు సైలెంట్ అయ్యాయి.