Monday, December 23, 2024

TG | ప‌ట్నంకు మ‌రో కేసులో బెయిల్

  • బోంరాస్ పేట పీఎస్ లో కేసు
  • ముంద‌స్తు బెయిల్ కు హైకోర్టులో పిటిష‌న్
  • ష‌ర‌తుల‌తో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు


హైద‌రాబాద్ – బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. బోంరాస్‌పేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లగచర్ల దాడి ఘటనలో అరెస్టయిన నరేందర్ రెడ్డి ఇప్పటికే బెయిల్‌‌పై బయటికి వచ్చారు. అయితే లగచర్ల దాడి ఘటన కంటే ముందే ఆయనపై బోంరాస్ పేట పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నేటి ఉదయం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు ముందస్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని, రూ.25 వేల సొంత పూచికత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement