Friday, November 22, 2024

NZB : చికిత్స పొందుతూ రోగి మృతి

నిజామాబాద్ సిటీ, నవంబర్ 26(ప్రభ న్యూస్):నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోగి మృతి చెందిన ఘటన కలకలం రేపింది.. రోగి మృతికి వైద్యులే కారణ మం టూ సదరు రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట న్యాయం చేయాలని ఆందోళన చేశారు. న్యాయం జరిగేంతవరకు ఇకనుంచి వెళ్ళేది లేదని భీష్ముంచుకొని కూర్చున్నారు.

వివరాలుఇలా ఉన్నాయి వర్ని మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ (52) యూరిన్ లో మంట రావడంతో 22వ తేదీన ఎలమ్మ గుట్ట లోని ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. నాలుగు రోజులుగా చికిత్స పొందు తున్న పేషంట్ ప్రసాద్ ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగాయి. వైద్యుల నీర్లక్షమే ప్రసాద్ మృతికి కారణమని కుటుంబ సభ్యులు వాపోయారు. నాలుగు రోజులుగా బీపి డౌన్ అయిన వైద్యులు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. టౌన్ సిఐ నరహరి, 4 టౌన్ ఎస్ఐ సంజీవ్ ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు సముదాయించి ఆందోళన విరమింపజేశారు. కుటుంబ సభ్యులు పిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతామని టౌన్ సిఐ నరహరి తెలిపారు. గతంలో కూడా ఇదే ఆస్పత్రి ఎదుట రోగి బంధు వులు పలు మార్లు ఆందోళన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

గుండె పోటు తోనే రోగి మృతిః వైద్యుడీ వెల్లడి
చికిత్స పొందుతున్నా పేషంట్ ప్రసాద్ కి బీపి డౌన్ అయి, గుండె పోటు కు గురై మృతి చెందినట్లు సంబంధిత వైద్యులు పేర్కొన్నారు. యూరిన్ లో మంట, మోషన్స్ రావడంతో రోగి తమ ఆసుపత్రిని సంప్రదించారని తెలిపారు. నాలుగు రోజులుగా మెరుగైన చికిత్స అందించా మని, పేషంట్ కు షుగర్ తగ్గడం వల్ల, బిపి లో అయి, హార్ట్ ఎటాక్ రావడం జరిగిందన్నారు. ఇందులో వైద్యుల నిర్లక్షం ఏమి లేదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement