సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గంలోని ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపునిచ్చారు. ఇటీవల బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు పనులు పూర్తికాకముందే రోడ్డును ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆడుకోవడం జరిగింది మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించాలనీ భావించిన నేతలకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టిఆర్ఎస్ కార్యకర్తలతో ప్రారంభోత్సవానికి రావడంతో ఘర్షణ మొదలైంది.
దీంతో మైపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఎమ్మెల్యే పై నిరసనగాపటాన్ చేరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పటాన్ చేరు తరలి రావడం జరిగింది. సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్‌చెరు స్లోగన్‌తో స్థానిక కార్యకర్తలు, నాయకులు నేడు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న కుర్చీలను పగలకొట్టారు. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గం కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పాత, కొత్త నేతల పంచాయితీ సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టడంతో పటాన్‌చెరు చౌరస్తా వద్ద భారీగా పోలీసులను మోహరించారు.